భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచ కప్ 2023 పోరుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్(సీఎస్‌ఏ) జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో గల టీమ్‌ను ఆదివారం వెల్లడించింది. ఈ జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన ప్రొటీస్ జట్టు బలంగానే కనిపిస్తోంది.
గాయాల కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నార్ట్జేతో పాటు సిసంద మగాలా ఈ టోర్నీకి దూరమయ్యారు. వీరి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
??? ????? ?? ???? ??? #CWC23 #BePartOfIt pic.twitter.com/mz9mEvt9Hh
— Proteas Men (@ProteasMenCSA) September 23, 2023
కాగా, వరల్డ్ కప్ ప్రస్థానం మొదలైననాటి నుంచి ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఒక్కసారి విజేతగా నిలవలేదు. ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలనే పట్టుదలతో ప్రొటీస్ జట్టు బరిలోకి దిగుతోంది. ప్రధానంగా ఆ జట్టు హిట్టర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లు రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రియాజ్ షంషీ, వాండర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్.
దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్
- అక్టోబర్ 7: దక్షిణాఫ్రికా vs శ్రీలంక (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)
- అక్టోబర్ 12: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో)
- అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం, ధర్మశాల)
- అక్టోబర్ 21: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా (వాంఖడే స్టేడియం, ముంబై)
- అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ (వాంఖడే స్టేడియం, ముంబై)
- అక్టోబర్ 27: పాకిస్థాన్ vs సౌతాఫ్రికా (చిదంబరం స్టేడియం, చెన్నై)
- నవంబర్ 1: న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె)
- నవంబర్ 5: భారత్ vs సౌతాఫ్రికా (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- నవంబర్ 10: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)