హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కట్టుబడి ఉందని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అన్నారు. త్వరలోనే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం నుంచి వెలుగులోకి వచ్చే క్రికెటర్లను ఐపీఎల్‌లో చూడాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్స్‌ను అపెక్స్ కౌన్సిల్ మెంబర్లతో కలిసి జగన్ రావు సందర్శించారు.
ఆ జిల్లాలో ఎంతో మంది చిన్నారులకు మెరుగైన ట్రెయినింగ్ అందిస్తున్న కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆగంరావును అభినందించారు. రాష్ట్రంలో మండల స్థాయి నుంచి ప్రతిభావంతులను గుర్తించి వెలికితీస్తామని చెప్పారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి తొలి అడుగుగా కోటిన్నర రూపాయల ఖర్చుతో అన్ని జిల్లాల్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు.