విండీస్‌లో మొదలైన క్రికెట్​

కింగ్స్‌‌టౌన్‌‌: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌‌ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్లేయర్లు ఔట్‌‌డోర్ ట్రెయినింగ్‌‌ మొదలుపెడుతున్నారు. కానీ వెస్టిండీస్‌‌లో పరిస్థితి మరోలా ఉంది. కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో కరీబియన్‌‌ గడ్డపై  క్రికెట్‌‌ మళ్లీ మొదలైంది. స్థానిక సెయింట్‌‌ విన్సెంట్‌‌ గ్రెనెడియన్స్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఓ టీ10 లీగ్‌‌ జరుగుతోంది. విన్సీ టీ10 ప్రీమియర్‌‌ లీగ్‌‌ పేరుతో  నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్‌‌ బరిలో ఉన్నాయి.  కరోనా దెబ్బకు క్రికెటింగ్‌‌ యాక్షన్‌‌ నిలిచిపోయిన తర్వాత.. టెస్ట్‌‌ హోదా కలిగిన ఓ దేశంలో జరుగుతున్న తొలి టోర్నీ ఇదే.  ఈ లీగ్‌‌లో పేరున్న విండీస్‌‌ స్టార్లు లేకపోయినా లోకల్‌‌ ఫ్యాన్స్‌‌కు క్రికెట్‌‌ మజా అందుతోంది. మే 31 న ముగిసే ఈ టోర్నీ ద్వారా  వైరస్‌‌ వ్యాప్తి జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేడియంలోకి ఫ్యాన్స్‌‌ను అనుమతించడం లేదు. ఆటలో భాగంగా బాల్‌‌పై సలైవా వాడడాన్ని నిషేధించారు. బౌండ్రీల వద్ద శానిటైజర్లను  అందుబాటులో ఉంచారు. అంపైర్లు ఫేస్‌‌ మాస్కులు వాడుతున్నారు.

For More News..

జూన్ 10 కల్లా రైతుబంధు పైసలు

మాస్క్​ అవసరం కాదు.. అలవాటైపోయింది

64 మందితో 24గంటల సర్జరీ