సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. రోవ్‌మన్ పావెల్ సారథ్యంలో 15 మంది సభ్యులు గల బలమైన జట్టును ఎంపిక చేసింది. విశ్రాంతి పేరుతో స్టార్ ఆల్‍రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 సిరీస్ నుంచి తప్పుకోగా.. జాసన్ హోల్డర్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.
ఎంపికైన ఆటగాళ్లపై తమకు నమ్మకం ఉందని, 2026లో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్ కోసం పటిష్ట జట్టును తయారు చేస్తున్నామని ప్రధాన కోచ్ డారెన్ సామీ తెలిపారు. బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కోవడం ఒకరకంగా జట్టుకు మరింత మంచి చేకూరుస్తుందని సామీ అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్ , ఫాబియన్ అలెన్, షాయ్ హోప్ , అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, గుడాకేష్ మోతి, నికోలస్ పూరన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.
వెస్టిండీస్ vs సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20 (ఆగస్టు 23): బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ(ట్రినిడాడ్)
- రెండో టీ20 (ఆగస్టు 25): బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ(ట్రినిడాడ్)
- మూడో టీ20 (ఆగస్టు 27): బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ(ట్రినిడాడ్)
కాగా, ఈ ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0తో సొంతం చేసుకుంది.
Cricket is back for the summer!☀️🌴
— Windies Cricket (@windiescricket) July 29, 2024
The West Indies v South Africa Men's rivalry continues plus double-headers with Women's CPL!🔥
Buy Tickets! ⬇️🎟https://t.co/iv7aEvv9hN#WIvSA | #WCPL pic.twitter.com/aB4VlD1WBt