ఈ నెల 12 నుంచి కరేబియన్ గడ్డపై ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం ప్రారంభంకానుంది. ఈ సిరీస్ కోసం.. భారత ఆటగాళ్లు ఇప్పటికే వెస్టిండీస్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇండియాతో తలపడబోయే కరేబియన్ జట్టును ప్రకటించింది. మొత్తం 13 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే మొదటి టెస్టు కోసమే జట్టును ఎంపిక చేయడం గమనార్హం.
ఈ జట్టుకు క్రెగ్ బ్రాట్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్‌వాల్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. షనన్ గాబ్రియెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. కాగా, ఆదివారం డొమినికా వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ ఇరు జట్ల మధ్య 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
వెస్టిండీస్ జట్టు(మొదటి టెస్ట్): క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, టాగెనరైన్ చంద్రపాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), షనన్ గాబ్రియెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్కెన్జియర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్.
రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
West Indies' squad for the first Test Vs India:
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2023
Kraigg Brathwaite (C), Holder, Joseph, Blackwood, Alick Athanaze, Tagenarine, Cornwall, Joshua, Gabriel, Kirk McKenzie, Raymon Reifer, Roach and Jomel Warrican. pic.twitter.com/rAhLFu9lHr