
జపాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ కొనసాగనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సోమవారం (ఏప్రిల్ 28) ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA), ఐచి-నగోయా క్రీడల నిర్వాహక కమిటీ (AINAGOC) మధ్య జరిగిన సమావేశంలో క్రికెట్ ఆసియా గేమ్స్ లో కొనసాగనున్నట్టు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి.
టీ20 ఫార్మాట్ లో ఆసియా క్రీడల్లో క్రికెట్ జరగనుంది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి సీనియర్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ యంగ్ ఇండియాను ఈ టోర్నీ కోసం పంపనుంది. ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లున్నారు. భారత బి జట్టును పంపినా గోల్డ్ మెడల్ సాధించడం పక్కాగా కనిపిస్తుంది. 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో భారత్ కు గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. 2028 లో జరగబోయే ఒలింపిక్స్ కు మాత్రం అన్ని జట్లు పాల్గొంటాయి కాబట్టి ప్రధాన జట్టు బరిలోకి దిగనుంది.
2010లో తొలిసారిగా ఆసియా క్రీడల్లో క్రికెట్ ఆడారు. ఆ తర్వాత, 2014లో కూడా క్రికెట్ కొనసాగింది కానీ 2018లో తొలగించబడింది. 2022లో హువాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో క్రికెట్ మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. 2023 ఆసియా క్రీడల్లో సైతం క్రికెట్ ను జరిపారు. నిన్నటివరకు క్రికెట్ ను ఉంచాలా లేదా అనే విషయంలో అనిశ్చితి ఉన్నపటికీ.. తాజాగా ఈ విషయంపై ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా శుభవార్త చెప్పింది.
మహిళా విభాగంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకొని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2023 ఆసియా క్రీడల్లో ఇండియా ఫైనల్లో శ్రీలంకను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. మెన్స్ క్రికెట్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా ఒక్కోసారి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాయి. జపాన్ మూడు క్రికెట్ వేదికలను సిద్ధం చేస్తోంది. ఒసాకాలోని కైజుకా క్రికెట్ గ్రౌండ్, సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్, సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ 2 స్టేడియాల్లో మ్యాచ్ లు జరనున్నాయి.
Cricket has retained its place in the Asian Games programme and will be part of the 2026 edition in Japan. 🏏#AsianGames @Khelnowcricket pic.twitter.com/KxlGGfUx4A
— Khel Now (@KhelNow) April 30, 2025