Cricket World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్.. అశ్విన్ స్థానంలో ఆల్‌రౌండర్‌కి చోటు

Cricket World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్.. అశ్విన్ స్థానంలో ఆల్‌రౌండర్‌కి చోటు

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాతో గెలిస్తే..మరో వైపు  ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడింది.

Also Read : Cricket World Cup 2023: గిల్ వచ్చేస్తున్నాడు: పాక్‌తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు పయనం

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ ( వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ.