Cricket World Cup 2023: క్రికెటర్లపై పగబట్టిన భారత్ దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం

Cricket World Cup 2023: క్రికెటర్లపై పగబట్టిన భారత్ దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం

పాములు పగబడతాయని విన్నారా! వినే ఉంటారు. మరి దోమలు పగబడతాయని ఎప్పుడైనా విన్నారా! వినుండరు. ఒకరివెంట మరొకరు భారత క్రికెటర్లు, కామెంటేటర్లు డెంగ్యూ బారిన పడుతుండటం చూస్తుంటే దోమలు కూడా పగబడతాయని అనిపిస్తోంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. దాని నుంచి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇదిలావుంటే తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డారు. 

భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో ఆయన అక్టోబర్ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తెలియజేశారు. దాయాదుల పోరు(భారత్‌-పాకిస్థాన్‌) దూరమవుతున్నందుకు నిరాశగా ఉందని తెలిపాడు. నేను డెంగ్యూ బారిన పడ్డాను.. అందువల్ల బలహీనత, తక్కువ రోగనిరోధక శక్తి అసాధ్యం చేస్తోంది. త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నా.." అని హర్ష భోగ్లే ట్వీట్ చేశారు.

గిల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు

ఇదిలావుంటే, అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరగునున్న మ్యాచ్ లో శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దానిపై అధికారిక సమాచారం లేదు. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న గిల్.. ప్రస్తుతం బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్ లో చెమటలు చిదిస్తున్నాడు. ఈ ఏడాది గిల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేయగా.. సగటు 72.35, స్ట్రైక్ రేట్ 105.03 ఉంది.

ALSO READ : అమ్మలా పాలిచ్చింది..నాన్నలా ఆడించింది.. పులి పిల్లల మీద చింపాంజీ ప్రేమ..