భారత్ పాకిస్థాన్ పాక్ మ్యాచు అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచు జరిగిందంటే చాలు అభిమానులు ఎగబడిపోతారు. అయితే ఈ సారి స్వదేశంలో పాక్ తో మ్యాచ్ జరగబోతుండడంతో దేశమంతా పండగ వాతావరం నెలకొంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ గ్రాండ్ గా వేడుకలు నిర్వహిస్తుంటే.. పలు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇక ఈ మ్యాచు పిచ్ రిపోర్ట్ గురించి ఒక సారి పరిశీలిస్తే..
సాధారణంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ అంటే బ్యాటింగ్ కి స్వర్గధామంగా ఉంటుంది. ఐపీఎల్ తో పాటు పలు మ్యాచుల్లో ఈ గ్రౌండ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ప్రారంభంలో ఇక్కడ పిచ్ పై బౌన్స్, స్వింగ్ ఎక్కువగా లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 2021 తర్వాత ఇక్కడ పిచ్ పై ఎర్రమట్టిని ఉపయోగించలేదు. ఛేజింగ్ చేసే వారికి ఈ పిచ్ అనుకూలంగా అంటుంది. మ్యాచ్ సాగే కొద్ది ఈ పిచ్ బౌలర్లకు ఇబ్బందిగా మారుతుంది. రికార్డ్ ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్- న్యూజీలాండ్ మధ్య జరిగిన మ్యాచులో కూడా మొదట బౌలింగ్ చేసిన కివీస్ బౌలర్లు రాణిస్తే ఆ తర్వాత బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ కి టాస్ కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి మ్యాచ్ పై ఎవరు పట్టు సాధిస్తారో చూడాలి.