Cricket World Cup 2023: పాలస్తీనాకు మద్దతు తెలిపిన పాక్ క్రికెటర్.. భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్త!

Cricket World Cup 2023: పాలస్తీనాకు మద్దతు తెలిపిన పాక్ క్రికెటర్.. భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్త!

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదాన్ని హమాస్ మిలిటెంట్లు(పాలస్తీనా) అగ్ని జ్వాలగా మార్చేసిన విషయం విదితమే. అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ఉగ్రమూకలు వందల మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొందరిని బందీలుగా చేసుకున్నారు. అందుకు ఇజ్రాయెల్‌ సైన్యం.. గట్టిగానే బుద్ధి చెప్తోంది. ఒకవైపు విద్యుత్తు, ఇంధనం, ఆహారా సరఫరాలు నిలిపేసిన ఇజ్రాయెల్‌.. మరోవైపు వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. 

ఇదిలావుంటే, ఈ ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ క్రికెట్‌లోకి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని గాజా(పాలస్తీనా) పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 

ALSO READ: Cricket World Cup 2023: ఓ వైపు లోపాలు.. మరోవైపు తప్పులు: బీసీసీఐపై క్రికెట్ అభిమానులు గరం గరం

"పాకిస్తాన్ జట్టు విజయంలో నేనూ భాగమైనందకు సంతోషిస్తున్నా.. ఈ విజయాన్ని గాజాలోని మా సోదరులు, సోదరీమణులకు అంకితం.. అలాగే, ఇన్నాళ్లు హైదరాబాద్ ప్రజలు మా పట్ల చూపిన అభిమానం, వారిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు.." అని రిజ్వాన్ ట్వీట్ చేశాడు.

భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్త..!

ఓ పాకిస్తాన్ పౌరుడిగా(రిజ్వాన్).. పాలస్తీనాకు మద్దతు తెలపడం సరైనదే అయినా, భారత్‌లో ఉంటూ ట్వీట్ చేయటం వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అభిమానులు అతనికి సూచిస్తున్నారు. క్రికెట్‌కు రాజకీయాలు ముడి పెట్టొద్దని చెప్పే పాక్ ఆటగాళ్లు ఇలాంటివి చేయడం అర్థరహితమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో భారత్.. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపగా, పాకిస్తాన్.. పాలస్తీనాకు సపోర్ట్ చేస్తోంది.