Cricket World Cup 2023: వరుసగా రెండో ఓటమి.. తేలిపోతున్న వరల్డ్ కప్ హీరోలు

Cricket World Cup 2023: వరుసగా రెండో ఓటమి.. తేలిపోతున్న వరల్డ్ కప్ హీరోలు

వన్డే ప్రపంచ కప్‌లలో ఐదు సార్లు విజేతలమంటూ విర్రవీగే పటిష్ట ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్.. 134 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మొదట ప్రొటీస్ బ్యాటర్లు 311 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు 177 పరుగులకే కుప్పకూలింది.

డికాక్ జోరు.. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టినన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. డికాక్‌(109) పరుగులు చేయగా.. ఐడెన్ మార్క్‌క్రమ్(56) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. హేజిల్ వుడ్, కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు.

పెవిలియన్‌కు క్యూ కట్టిన ఆసీస్ బ్యాటర్లు

అనంతరం 312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా వెంటవెంటనే కోల్పోయింది. ఒకరివెంట మరొకరు పోటీపడుతూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఒకానొక సమయంలో 100 లోపే ఆలౌట్ అవుతుంది అనుకున్నప్పటికీ.. మార్నస్ లబుచానే(46), మిచెల్ స్టార్క్(27) ఆ జట్టు పరువు నిలబెట్టారు. ప్రొటీస్ బౌలర్లలో రబడా 3 వికెట్లు తీసుకోగా.. కేశవ్ మహరాజ్, షంషీ, మార్కో జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

ALSO READ: Cricket World Cup 2023: వరుసగా రెండో సెంచరీ.. రికార్డుల వర్షం కురిపించిన డికాక్‌
 

3వ స్థానంలో ఇండియా

ఇప్పటివరకూ ప్రతి జట్టు రెండేసి మ్యాచ్ లు ఆడగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్,ఇండియా,  పాకిస్తాన్ రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.