ప్రస్తుత భారత వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందులో ఒకరు వైస్ కెప్టెన్.. హార్దిక్ పాండ్యా కాగా, మరొకరు సర్ రవీంద్ర జడేజా. ఇంకొకరు లార్డ్ శార్దూల్ ఠాకూర్. ఈ లార్డ్ గురుంచే ఇప్పుడు నెట్టింట జరుగుతున్న చర్చంతా. జట్టులో ఎందుకున్నావని మొహమాటం లేకుండా అతన్నే ప్రశ్నిస్తున్నారు.. విమర్శకులు. అందుకు కారణం అతని వైఫల్యం. వచ్చేదే అరకొర అవకాశాలంటే.. వాటిలోనూ రాణించడు. ఒకవేళ అడపాదడపా రాణించినా.. టెయిలండర్ల వికెట్లు, ఏడాదికో హాఫ్ సెంచరీ.
లార్డ్ ఠాకూర్
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అతని ప్రదర్శనను ఎండగడుతూ ట్రోలర్స్ అతనిపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. శార్దూల్ మ్యాచ్ ఆడుతున్నాడా! చూస్తున్నాడా! అంటూ వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. తుది జట్టులో అతడు కనిపిస్తుంటే.. మ్యాచ్‌పైనే ఆసక్తి తగ్గిపోతోందని తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన ఠాకూర్.. ఒక క్యాచ్ పట్టగా, బౌలింగ్ లో ఒక వికెట్ తీశాడు. ఇదీ అతని ప్రదర్శన.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన ఈ ఆల్‌రౌండర్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‍లో ఆమాత్రం కూడా రాణించలేద . భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలతో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు ఐదుగురూ తలో రెండు వికెట్లు తీస్తే.. ఇతడు మాత్రం వారిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన శార్దూల్.. 12 పరుగులిచ్చి వికెట్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక బ్యాటింగ్‌లో అతడికి క్రీజులోకొచ్చే అవకాశమే రాలేదు. దీంతో అతడు జట్టులో ఎందుకని మాజీలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
What is the point in playing Shardul Thakur...?
— Amit yadav (@AMITYAD34372576) October 14, 2023
He hardly bowled 2 overs
He is an average bowler... Average batsman
Ashwin should be picked in his place or maybe SKY
రవిచంద్రన్ అశ్విన్
గురువారం బంగ్లాదేశ్ తో జరుగనున్న మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో ఉండకూడదని అభిమానులు వేడుకుంటున్నారు. అతని స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవకాశం ఇవ్వాలని భారత కెప్టెన్ రోహిత్ కు మొరపెట్టుకుంటున్నారు. సునీల్ గవాస్కర్ వంటి సీనియర్లు కూడా అదే సూచిస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అయినా.. అతడు తుది జట్టులో ఉండకూడదని కోరుకుందాం..