వన్డే వరల్డ్ కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ భారత్ లో 46 రోజుల పాటు జరగనుంది. మొత్తం 10 జట్లు ఆడబోయే ఈ టోర్నీలో ఈ సారి వెస్టిండీస్, జింబాబ్వే జట్లకు మాత్రం చోటు దక్కలేదు. వరల్డ్ కప్ ను మొదటి రెండు సార్లు గెలుచుకున్న వెస్టిండీస్ కు ఇంతటి ఘోర పరాభవం ఎదురుకావడం ఇదే మొదటిసారి. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి జట్ల చేతిలో వెస్టిండీస్ ఘోర పరాజయాలను చవిచూడటంతో ఈ టోర్నీలో చోటు సంపాదించలేకపోయింది. ఒకప్పుడు తిరుగులేని జట్లుగా పేరొందిన వెస్టిండీస్ కనీసం వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఈ సారి తమ జట్టు లేకుండానే టోర్నీని ఆ దేశ ప్లేయర్లు ఊహించుకోలేకపోతున్నారు.
వెస్టిండీస్ పతనానికి దారితీసిన కారణాల గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే.. స్టార్ ఆటగాళ్లను తయారు చేయడంలో వెస్టిండీస్ విఫలమైందని చెప్పాలి. గతేడాది ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లకు ఎగబాకిన నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షిమ్రాన్ హెట్‌మేయర్ లాంటి క్రికెటర్లు టీ20 లీగ్‌లలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ అలాంటి ఆటగాళ్లలో ఫామ్ నిలకడగా లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. 2014లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కి, ఆటగాళ్లకు మధ్య జరిగిన వాగ్వాదం, మేనేజ్‌మెంట్‌తో చెల్లింపు వెస్టిండీస్ క్రికెట్ జట్టును అర్థికంగా కూడా కిందపడేసిందని చెప్పవచ్చు.
ALSO READ | సప్తపది, ఆచారాల్లేని పెళ్లి.. పెళ్లే కాదు.. హైకోర్టు కీలక తీర్పు
గతేడాది వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ నిజాన్ని బయటపెట్టాడు. వెస్టిండీస్ క్రికెట్ ఆర్థిక ఇబ్బందులపై సామీ మాట్లాడుతూ, భారత అగ్రశ్రేణి స్టార్లు సంవత్సరానికి సుమారు రూ. 7 కోట్లు సంపాదిస్తే, వెస్టిండీస్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ద్వారా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే పొందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా రస్సెల్, నరైన్ వంటి ఆటగాళ్ళు వెస్టిండీస్ కోసం కంటే ప్రపంచవ్యాప్తంగా టీ 20 పోటీలు ఆడటం ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు అనే భావనలోఉన్నారు