వరల్డ్ కప్ లో టీమిండియాకు భారీ షాక్. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మెగా టోర్నీ నుంచి మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టోర్నీ నుంచి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అక్టోబరు 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది. దీంతో నొప్పితో పాండ్యా మైదానాన్ని వీడాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. తొలి ఓవర్ మూడో బంతి వేయగా..ఈ బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. దానిని కాలితో ఆపేందుకు పాండ్యా ప్రయత్నించాడు. బంతి కాలి మడమకు బలంగా తాకింది. దీంతో పాండ్యా నొప్పితో విలవిల్లాడాడు. పాండ్యా మైదానాన్ని వీడటంతో కోహ్లీ ఆ ఓవర్ ను పూర్తి చేశాడు. పాండ్యా బంగ్లాదేశ్ మ్యాచ్ కంటే ముందు ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు తీశాడు.
వరల్డ్ కప్ లో భారత్ విజయాల జైత్ర యాత్ర కొనసాగిస్తోంది ఇప్పటి వరకు ఆడిన 7 ఏడు మ్యాచుల్లోనూ 7 గెలిచి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. పాయింట్ల పట్టికలోనూ టాప్ ప్లేసులో ఉంది.
India's star all-rounder to miss the remainder of #CWC23.
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023
Details ?https://t.co/AQP0oip3va