David Warner: రాబిన్‌హుడ్ ప్ర‌మోష‌న్స్కు క్రికెటర్ వార్న‌ర్.. అదిరిపోయే ప్లాన్తో మేకర్స్

David Warner: రాబిన్‌హుడ్ ప్ర‌మోష‌న్స్కు క్రికెటర్ వార్న‌ర్.. అదిరిపోయే ప్లాన్తో మేకర్స్

నితిన్ రాబిన్‍హుడ్ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

అదేంటంటే.. మార్చి 28న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రాబిన్‍హుడ్ మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ను కూడా రంగంలో దింపుతున్నట్లు డైరెక్టర్ వెంకీ తెలిపారు.

మంగ‌ళవారం మార్చి 11న  ఏర్పాటు చేసిన రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్లో వెంకీ కుడుముల ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపాడు. ఈ సినిమాలో డేవిడ్ చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ.. ఎంతో ఎనర్జీతో, ఉత్సాహంగా చేసినట్లు వెంకీ చెప్పారు.

Also Read:-మార్చి (10 to 16) ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్లు..

అంతేకాకుండా, ఫ్యాన్స్ను క‌ల‌వ‌డానికి వార్న‌ర్ చాలా వెయిట్ చేస్తున్నాడ‌ని వెంకీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దాంతో సినీ కం క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి వార్న‌ర్ రాక స్టేజిపై ఎలాంటి హంగామా చేయనుందో చూడాలి.

ఈ మూవీలో డేవిడ్ వార్నర్ సీన్ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఇప్పటికే, ఆ లొకేషన్ నుంచే ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో వార్నర్ స్టయిలిష్ లుక్లో అదరగొట్టేశాడు. 37 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ తెల్లటి చొక్కాతో షూటింగ్ స్పాట్ లో ఎరుపు హెలికాప్టర్ నుండి దిగి వస్తూ హల్ చల్ చేస్తున్నాడు.

పెద్ద లాలిపాప్‌ను పీలుస్తూ సన్ గ్లాస్ పెట్టుకొని అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. గోల్డెన్ తుపాకీతో వార్నర్ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో కొందరిని కాలుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.