Mahesh Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు.. మహేష్ బాబుకు వార్నర్ బర్త్ డే విషెస్

Mahesh Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు.. మహేష్ బాబుకు వార్నర్ బర్త్ డే విషెస్

బాలీవుడ్ సినీనటుడు, ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. 1975, ఆగష్టు 9న జన్మించిన మహేష్ నేటితో 48 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సహచర నటీనటులు, అభిమానులు, సినీ నిర్మాణ సంస్థలు మహేశ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెట్టాయి. ఇదిలావుండగా, ఈ అందాల రాకుమారుడికి.. ఆస్ట్రేలియా క్రికెటర్, మాజీ సన్‌రైజర్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెష్ తెలియజేశాడు. 

'హ్యాపీ బర్త్ డే లెజెండ్.. ' అన్న క్యాప్షన్‌తో వార్నర్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. క్రికెట్‌తో బిజీ బిజీ జీవితాన్ని గడుపుతూ కూడా ఈ ఆసీస్ బ్యాటర్.. మహేష్ బాబుకు విషెష్ చెప్పడం తెలుగు హీరోలు, తెలుగు అభిమానుల పట్ల అతని మక్కువను చూపుతోంది. ప్రస్తుతం వార్నర్ కెనడా వేదికగా జరుగుతోన్న గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.

మరోవైపు, మహేష్ బాబు పుట్టినరోజు సంధర్భంగా అతను నటించిన 'మురారి' సినిమాను రీ రిలీజ్‌ చేశారు. దాంతో, థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొందరు అభిమానులు డ్యాన్స్‌లతో అలరిస్తే.. మరికొందరు ఏకంగా పెళ్లిపీటలెక్కారు.