పేరుకే పెళ్లాం.. ముద్దు లేదు, మురిపం లేదు: పాండ్యా- నటాషా విడాకుల వెనుక రహస్యం!

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ వైవాహిక బంధం పెటాకులైన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తమ పరిచయంలో మూడు సార్లు ఒక్కటైన ఈ జంట కలిసుండలేక ఈ మధ్యనే విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ఆ సమయంలో ఎందుకు విడిపోతున్నామనే విషయాన్ని మాత్రం ఈ జంట వెల్లడించలేదు. తాజాగా, ఆ బాగోతమూ బయటపడింది. 

దురుసు ప్రవర్తన

హార్దిక్ పాండ్యా మైదానంలో ఎలా నడుచుకుంటాడు, సహచర ఆటగాళ్లతో అతను మెలిగే తీరు ఎలా ఉంటుంది.. అన్నది అభిమానులకు బాగా సుపరిచితమే. పాండ్యాకు నోటి దూల ఎక్కువ. అందునా, సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటూ ఉంటాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీలో అలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. వైవాహిక జీవితంలోనూ పాండ్యా అలానే నడుచుకున్నట్టు తెలుస్తోంది.

ALSO READ : Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా స్టార్క్ సతీమణి.. ఆస్ట్రేలియా ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టు ప్ర‌క‌టన

నేనింతే అన్నట్టు నడుచుకునేవాడు

భారత క్రికెటర్ వ్యక్తిత్వంతో నటాషా విసిగిపోయిందని, అందుకే వీరు విడాకులు తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య వ్యక్తిత్వపరంగా చాలా తేడాలున్నట్లు పాండ్యా సతీమణి గుర్తించిందట. భారత దేశ సంస్కృతి, హిందూ సంప్రదాయ విలువలు తెలిసి అతని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా నడుచుకునేందుకు ఎంతో ప్రయత్నించిందట. కానీ జీవితాంతం అతనితో ఇలానే ఉండలేక ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుందని నటాషా సన్నిహితులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె ఎంతోగానో ఆలోచించిందని.. కానీ, హార్దిక్‌ తీరు మారకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @natasastankovic__

అందానికి ఆకర్షితుడై..

మోడల్, నటి అయిన నటాషా అందానికి ఆకర్షితుడైన పాండ్యా 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో ఆమె చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం కుటుంబసభ్యుల నడుమ ఆమెను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. 2020 జులైలో నటాషా అగస్త్యకు జన్మనిచ్చింది. ఇక్కడితో ఊరుకోని ఈ జంట 2023 ఫిబ్రవరి 14న ఉదయ్‌పుర్‌(రాజస్థాన్‌) ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎన్ని చేసుకున్నా.. వారు కలిసుండలేకపోయారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @natasastankovic__

విడాకుల తర్వాత నటాషా కొడుకుని తీసుకుని స్వదేశం సెర్బియాకు వెళ్లిపోగా.. పాండ్యా మాత్రం మరొక తోడు వెతుక్కున్నాడు. భారత ఆల్ రౌండర్ బ్రిటన్‌ సింగర్‌ జాస్మిన్‌ వాలియాతో డేటింగ్‌ చేస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది.