Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా

ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. గురువారం (సెప్టెంబర్ 5, 2024) బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాం డిల్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు. రివాబా తన భర్త రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వ కార్డు ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. 35 యేళ్ల రవీంద్ర జడేజా ఇటీవలే T20  నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో భారత్ చారిత్రాత్మక  T 20 తర్వాత గుడ్ బై చెప్పాడు జడేజా.  

మెంబర్ షిప్ డ్రైవ్ ను ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంబించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీలో ప్రధాని మోదీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. 

రవీంద్ర జడేజా భార్య రివాబా 2019లో బీజేపీ లో చేరారు. 2022లో జామ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్మూర్ ను ఓడించి రివాబా విజయం సాధించారు.