రేప్ కేసులో క్రికెటర్ లామిచానె శిక్ష రద్దు

రేప్ కేసులో క్రికెటర్ లామిచానె శిక్ష రద్దు

ఖాట్మండు : నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లామిచానెకు రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నుంచి ఊరట లభించింది. అతనికి విధించిన ఎనిమిదేండ్ల శిక్షను పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. అలాగే లామిచానెపై నమోదైన అన్ని ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022లో తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు వేసిన కేసులో  కట్మాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కోర్టు జనవరిలో 8 ఏండ్ల జైలు శిక్షను విధించింది.

కొన్ని రోజులు జైలులో గడిపి బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విడుదలైన లామిచానె హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగాడు. కేసును సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు అన్ని ఆధారాలను పరిశీలించి శిక్షను రద్దు చేస్తూ తీర్చు ఇచ్చింది. కాగా, శిక్ష రద్దవడంతో లామిచానె టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే నేపాల్ టీమ్ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు అన్ని ఫార్మాట్లలో జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.