స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెటరైన ఈ అందాల ముద్దగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. పేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్(ట్విట్టర్) సైట్లలో పదుల సంఖ్యలో ఫ్యాన్ పేజీలు దర్శనమిస్తుంటాయి. అంతటి అందం తనది. అందం క్రికెట్ ఆడితే...దానిని స్మృతి మంధాన! అంటారు అని కొందరు కవిత్వాలు కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఆమె గురుంచి వర్ణన ఎందుకంటారా..! మంచి సద్గుణాలు ఉన్న వరుడు కావలెను అని మందాన ప్రకటన ఇచ్చింది.
ఇటీవల మంధాన.. ఇషాన్ కిషన్‌తో కలిసి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి హాజరైంది. ఈ షోలో ఓ అభిమాని నుంచి మంధానకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదుర్కొంది. "ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఎక్కువగా అబ్బాయిలు ఫాలో అవుతుంటారు కదా! ఒక వ్యక్తిలో మీకు నచ్చే లక్షణాలు ఏమిటి..?" అని ప్రశ్నించాడు. దీనికి మంధాన ఏం చెప్పాలో తెలియక కాసేపు సిగ్గుపడింది. కాసేపటి ఆలోచించాక చాలా చక్కని సమాధానమిచ్చింది.
''ఇలాంటి ప్రశ్న అడుగుతారని నేను అసలు ఊహించలేదు. మంచి అబ్బాయి అయి ఉండాలి( అచ్చా లడ్కా హో). ఇది చాలా ముఖ్యం. అలాగే అతను నా పరిస్థితిని, ఆట(క్రికెట్)ను అర్థం చేసుకోవాలి. ఒక అమ్మాయిగా నేను అతనికి అంత ఎక్కువ సమయం ఇవ్వలేను. ఆ విషయం అతను అర్థం చేసుకోవాలి. నా కాబోయే భర్తలో ఈ రెండు లక్షణాలను ముఖ్యంగా చూస్తాను..'' అని మంధాన చిరునవ్వులు చిందిస్తూ చెప్పుకొచ్చింది.
Okay Smriti ? hum smjh gye ?#SmritiMandhana
— Ms. Lucky Varshney (लकी वार्ष्णेय)?? (@lntfl13) December 26, 2023
(Courtesy - Sony Liv) pic.twitter.com/YiEpzEytrW