12 గంటల వ్యవధిలో నాలుగు హత్యలు

  • సిటీలో కలకలం రేపుతున్న వరుస మర్డర్లు 
  • ఎక్కడో హత్య చేసి మరెక్కడో డెడ్​బాడీలను పడేస్తున్నరు
  • మొన్న మూసాపేటలో.. నిన్న లంగర్​హౌజ్​లో శరీర భాగాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రేటర్‌‌‌‌ సిటీలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మద్యం మత్తులో, రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌, భూవివాదాలు, పాత కక్షలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో చంపుకోవడం చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో నలుగురు హత్యకు గురయ్యారు. వీటికి తోడు ఎక్కడో చంపేసి,డెడ్‌‌‌‌బాడీలను మరెక్కడో పడేస్తుండడంతో పోలీసులు పరుగులు తీస్తున్నారు. డెడ్‌‌‌‌బాడీని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు ముక్కలుగా చేసి పోలీసులకు సవాలు విసురుతున్నారు. గత 10 రోజుల్లో 8 హత్యలు జరగడంతో మూడు కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు.

నయీం గ్యాంగ్ తరహాలో..

దుండగులు రెక్కీతోపాటు, పక్కా స్కెచ్ వేసి చంపేస్తున్నారు. మరికొంత మంది హత్య చేసిన అనంతరం పోలీసులకు సాక్ష్యాలు దొరక్కుండా ఉండేలా ప్లాన్​చేసి అటాక్​చేస్తున్నారు. గతంలో నయీం గ్యాంగ్ చేసిన విధంగా గోనె సంచులు, సూట్‌‌‌‌ కేసుల్లో మృతదేహాలను తరలిస్తున్నారు. మృతులు ఎవరనేది గుర్తించకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేస్తున్నారు. ప్రధానంగా తల, మొండెం, కాళ్లు, చేతులను విడివిడిగా వేర్వేరు ప్రాంతాల్లో పడేస్తున్నారు. చాలా చోట్ల శరీర భాగాలు కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. లేదా కుళ్లిపోయి కళేబరాలు మిగులుతున్నాయి. ఇలాంటి కేసుల్లో డెడ్‌‌‌‌బాడీ ఎవరిదనేది గుర్తిస్తే తప్ప కేసుల మిస్టరీ వీడడం లేదు. దీంతో గుర్తుతెలియని డెబ్‌‌‌‌బాడీల కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో ఉన్న మర్డర్‌‌‌‌ ‌‌‌‌కేసులు ఎటూ తేలడం లేదు. 

డెడ్‌‌‌‌బాడీలను గుర్తించడంలో సవాళ్లు

విడివిడిగా శరీర భాగాలు లభించినప్పుడు పోలీసులు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. హంతకులను గుర్తించలేక కేసు దర్యాప్తుకు బ్రేకులు పడుతున్నాయి. స్థానికులు అందించిన వివరాలు, ఘటనా స్థలంలో సేకరించిన క్లూస్ ఆధారంగా కొన్ని కేసులను పోలీసులు ఛేదించారు. మరికొన్ని కేసుల్లో సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల విచారణ,సెల్‌‌‌‌ఫోన్​టవర్ లొకేషన్‌‌‌‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలో జరిగిన 10 ఘటనల్లో 5 కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇటీవల జరిగిన ఘటనలు

గురువారం రాత్రి లంగర్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌లో అనారోగ్యంతో మృతి చెందిన అన్న బాడీని తోడపుట్టిన తమ్ముడు,చెల్లెలు ముక్కలు, ముక్కలుగా నరికి గోచె సంచిలో ప్యాక్ చేశారు. ఆటోలో తీసుకుకొచ్చి రోడ్డుపై పడేశారు. అంత్యక్రియలకు డబ్బులు లేకనే డెడ్‌‌‌‌బాడీని రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు రాజు, స్వరూపను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. అలాగే  రాంపల్లిలో అశోక్‌‌‌‌ అనే రియల్టర్ ను అతి దారుణంగా చంపేశారు. వనస్థలిపురం గౌతమినగర్‌‌‌‌‌‌‌‌లో రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ అనే కానిస్టేబుల్ కత్తితో భార్య మెడ కోసి హతమార్చాడు. పేట్‌‌‌‌బషీర్‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌లో ఓ యువకుని మెడకు వైర్ బిగించి హత్య చేశారు.

మే3: కూకట్‌‌‌‌పల్లి–మూసాపేట్‌‌‌‌ రైల్వే రోడ్డులో మహిళ మృతదేహం బయటపడింది.క్రికెట్‌‌‌‌ ఆడుతున్న పిల్లలకు మహిళ కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఎక్కడో హత్య చేసి తెచ్చి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 

మే4: హైకోర్టు వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్‌‌‌‌ నిర్వాహకుడు మిథున్‌‌‌‌ను కత్తులతో దాడి చేసి చంపారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలన్నందుకు ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేశారు.

మే5: జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో తాగిన మైకంలో పెయింటర్‌‌‌‌‌‌‌‌ సురేశ్ ను తోటి పెయింటర్స్ హత్య చేశారు.సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ కోసం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో పోలీసులు ఇద్దరు అరెస్ట్​ అయ్యారు.

ఏప్రిల్‌‌‌‌12: తుక్కుగూడలో సైదమ్మ అనే మహిళ హత్య చేసి మృతదేహం, ముక్కలు ముక్కలుగా చేసి పాలథిన్ కవర్స్‌‌‌‌లో ప్కాక్ చేశారు.ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌‌‌‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.