విజిబుల్ పోలీసింగ్​తో నేరాల నియంత్రణ : సునీల్ దత్

  •     విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడి
  •     పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోందని సీపీ సునీల్ దత్ ఓ ప్రకటనలో  తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.  నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతోపాటు కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు. పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు.