పలు క్రైం కేసులలో పోలీసులు క్రైమ్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో భాగంగానే దిశ కేసులో కూడా క్రైమ్ రీ కన్స్ట్రక్షన్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిశ కేసులో క్రైమ్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నిందితులు ఎదురుతిరగడంతో ఎన్ కౌంటర్ చేశామని చెప్పారు. అయితే ఆయా కేసులలో క్రైమ్ రీ కన్స్ట్రక్షన్ చేసిన విధానాలు వరుసగా…
దిశ కేసులో…
దిశ అత్యాచారం, హత్య కేసులో కూడా నిందితులతో సైబరాబాద్ పోలీసులు తలపెట్టిన క్రైమ్ రీకన్ స్ట్రక్షన్ ను చివరకు ఎన్ కౌంటర్ తో ముగిసింది. ఈ కేసులో పోయిన నెల 27న సాయంత్రం 4 గంటల నుంచి 28న తెల్లవారుజామున 5 గంటల వరకు నిందితులు ఏం చేశారన్నది సీన్ టూ సీన్ కన్ స్ట్రక్షన్ లో తేల్చాలని పోలీసులు అనుకున్నారు. ఇందులో తొండుపల్లి టోల్ గేట్ వద్ద నిందితులు లారీని పార్క్ చేసిన చోటు మొదలుకొని… దిశ రేప్ జరిగిన చోటు, హత్య, దహనం వరకు‘క్రైమ్ సీన్ రీకనస్ట్రక్షన్’తో గుర్తిం చాలని, ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పాషా, ఇతర నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులును తీసుకెళ్ళారు. అయితే, ఈ ప్రయత్నం లో చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
నలుగురు నిందితులూ పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో ఎస్సై వెంకటేశ్వర్లు , కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ తీవ్రం గా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఎన్ కౌంటర్ విషయంలో బాగా విమర్శ లు రావడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) విచారణ జరపాలని నిర్ణయించింది. మరోవైపు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలో 8 మందితో ఏర్పడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ )కూడా విచారిస్తోంది. ఈ రెం డు బృందాలు చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులు, ఇతర సిబ్బందిని ప్రశ్నిస్తున్నాయి.
Related News
అదే దృశ్యం.. మళ్లీ: కళ్లకుకట్టే క్రైమ్ రీ కన్స్ట్రక్షన్
సైకో శ్రీనివాస్ రెడ్డి కేసు…
ఈ ఏడాది ఏప్రిల్ 23న యాదాద్రి భువనగిరి జిల్లా హాజిపూర్ సైకో శ్రీనివాసరెడ్డి దారుణాలన్నింటినీ క్రైమ్ సీన్ రీకన్ స్ ట్రక్షన్ లో పోలీసులు నిర్ధారిం చారు. పాడుబడిన వ్యవసాయ బావిని ఎంచుకుని సైకో ఈ నేరాలను చేశాడని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించాలంటే… కేసు షీట్ సమగ్రంగా రూపొందించాలి. దానికోసం నివాసరెడ్డిని కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి సమీపంలో చేసిన రేప్ , హత్య కేసులకు సంబంధించి రీకన్ స్ట్రక్షన్ చేశారు.
శ్రీనివాసరెడ్డి వ్యవసాయ బావికి సమీపంలోని రోడ్డుమీద కాపుకాసేవాడు.
ఒంటరిగా అటు వైపు వెళ్తున్న గర్ల్ స్టూడెంట్ ని టార్గెట్ చేసేవాడు.
లి ఫ్ట్ ఇస్తా నని చెప్పి, బైక్ మీద ఎక్కించుకుని వ్యవసాయ బావి దగ్గరకు రాగానే రేప్ చేసేవాడు,
ఆ తర్వాత చంపేసి బావిలో పడేసేవాడు.
స్కూలు బ్యాగ్ లు, ఐడెంటిటీ కార్డులు, షూలు వగైరా ఆనవాళ్లేవీ దొరక్కుండా బావిలోనే గుంత తీసి పాతిపెట్టేవాడు.
క్రైమ్ రీకన్ స్ ట్రక్షన్ లో నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డి చెప్పిన సమాచారం మొత్తం కేసును ఓ కొలిక్కి తెచ్చింది. బావిలోనూ, చెట్ల పొదల్లోనూ అతడు పారేసిన కల్పన, మనీషల స్కూల్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు, యూనిఫాం, టిఫిన్ బాక్స్‌లు కూడా సేకరించగలిగారు పోలీసులు.
జయరాం హత్య కేసు…
ఈ ఏడాది జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో పోలీసులు సీన్ కనస్ట్రక్షన్ చేశారు. జయరాం హత్యకు ముందు రోజు జనవరి30న రాకేశ్ రెడ్డి ఇంటికి వచ్చిన జయరాం… దాదాపు 27 గంటల పాటు అదే ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో రాకేశ్ కు , జయరాంకు మధ్య ఏం జరిగిందన్న సమాచారమంతా రీ కనస్ట్రక్షన్ ద్వారానే తెలిసింది.
జయరాంని ఒక అమ్మాయితో ఫోన్ చేయించి రప్పించాడు. జయరాం ను కుర్చీకి కట్టేసి , తనకు రావలసిన బాకీకోసం ఆస్తి పేపర్లపై సంతకాల కోసం వత్తిడి చేశాడు. జయరాం పై పదే పదే చేయిచేసుకున్నాడు. వత్తిడిలో ఉన్న జయరాం షాక్ వల్ల చచ్చిపోయాడు. ఆ తర్వాత తనకు సన్నిహి తులైన ఇద్దరు పోలీసు ఆఫీసర్లతో మాట్లాడి, వాళ్లు చెప్పిన సూచనల్ని పాటించాడు. జయరాం శవాన్ని కారు డ్రైవింగ్ సీట్లో పెట్టి పారిపోయాడు.
సీన్ రీకన్ స్ ట్రక్షన్ లో… జయరాం డెడ్ బాడీని వాచ్ మేన్ శ్రీనివాస్ తో కలిసి కారులో వేసుకుని, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాడో పోలీసులు డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు. వెహికి ల్ ప్రయాణించిన రూట్లను టైమ్ టు టైమ్ రాకేశ్ స్టేట్ మెం ట్ లో రికార్డ్ చేశారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ ఆధారంగా సీన్ రీకన్ స్ ట్రక్షన్ చేశారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
సత్యం బాబుతో రీప్లే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది ఆయేషా మీరా హత్య కేసు. విజయవాడకు దగ్గర్లోని ఇబ్రహీంపట్నంలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా 2007 డిసెంబర్ 27న హత్యాచారానికి గురై చనిపోయింది. చోరీలు చేసే సత్యంబాబు అనే కుర్రాడిని ఈ కేసులో నిం దితుడిగా పోలీసులు పెట్టారు. డిసెంబర్ 27 రాత్రి ఆయేషా ఉంటున్న లేడీస్ హాస్టల్ కు సత్యం బాబు వచ్చి, పిట్టగోడ ఎక్కి లోపలికి ప్రవేశించి ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి నిందితుడు సత్యంబాబును హాస్టల్ దగ్గరకు తీసుకువచ్చి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 14 ఏళ్ల జైలు శిక్ష, రేప్ కు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 2010 సెప్టెంబరులో తీర్పు చెప్పింది. అయితే ఈ కేసులో సత్యం బాబు కావాలని పోలీసులు ఇరికించారన్న విమర్శలున్నాయి. తాను చోరీలు చేశానే తప్ప హత్యలు ఎన్నడూ చేయలేదని కేసు విచారణ మొదలైనప్పటి నుంచి సత్యంబాబు చెబుతూనే ఉన్నాడు. పోలీసులు తనతో బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని ఆరోపించాడు. మహిళా కోర్టు తీర్పు పై సత్యంబాబు అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ చేశాడు. చాలా కాలం పాటు విచారణ జరిగిన తరువాత సత్యం బాబును నిర్దోషి గా ప్రకటిస్తూ 2017 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక నిర్దోషి ని ఎనిమిదేళ్ల పాటు జైల్లో ఉంచారంటూ లక్ష రూపాయల నష్ట పరిహారం ఇప్పించింది హై కోర్టు.