
సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’. పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 14న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నటుడు, దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ ‘ కొత్త కాన్సెప్ట్‌తో రానున్న ఈ సినిమా అందరిని అలరించాలని కోరుకుంటున్నా. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. సంజన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది.