భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ అధికారులతో గురువారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగేలా చూడాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ మీటింగ్లో డీఎస్పీలు చంద్రభాను, రవీందర్, మల్లయ్య స్వామి, సీఐలు శ్రీనివాస్, రమాకాంత్, ఐటీ సెల్ నాగరాజు పాల్గొన్నారు.