Aha OTT: ఆహాలోకి రెండు తెలుగు కొత్త సినిమాలు.. మిస్టరీ థ్రిల్ల‌ర్తో పాటు లవ్ ఎంటర్టైనర్

Aha OTT: ఆహాలోకి రెండు తెలుగు కొత్త సినిమాలు.. మిస్టరీ థ్రిల్ల‌ర్తో పాటు లవ్ ఎంటర్టైనర్

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో ఒకటైన 'ఆహా వీడియో'(Aha Video)..మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుంటుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ, కామెడీ డ్రామా వంటి జోనర్స్లో సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం డబ్బింగ్, రీమేక్స్ కూడా ఈ ఓటీటీలో చూడొచ్చు. లేటెస్ట్గా ఓ రెండు తెలుగు కొత్త సినిమాల స్ట్రీమింగ్ వివరాలను అనౌన్స్ చేసింది ఆహా. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అనేది ఓ లుక్కేద్దాం.

‘షణ్ముఖ’:

ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా ష‌‌ణ్ముగం సాప్పని రూపొందించిన చిత్రం ‘షణ్ముఖ’. తుల‌‌సీరామ్ సాప్పని, ష‌‌ణ్ముగం సాప్పని, రమేష్‌‌ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2025 మార్చి 21న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది.

నేడు ఏప్రిల్ 10న ఆహా స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది." ఒక పోలీసు, ఒక పండితుడు, మరియు ఒక పురాతన రహస్యం! అడవిలో లోతుగా పాతిపెట్టబడిన మరచిపోయిన కథలు, దాచిన నిధులు మరియు రహస్యాలలోకి ప్రవేశించండి. ఏప్రిల్ 11 నుండి షణ్ముఖ ఓటీటీ స్ట్రీమింగ్.. కేవలం ఆహాలో మాత్రమే" అని పోస్టర్ ద్వారా వెల్లడించింది. 

కథేంటంటే:

సిటీలో అమ్మాయిలు వ‌రుస‌గా మిస్స‌వ్వడం, ఆ త‌ర్వాత నెల‌లోపే వారి బాయ్‌ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకోవడం వంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ వచ్చింది. ఈ మిస్ట‌రీపై రీసెర్చ్ పై క్రిమినాల‌జీ స్కాల‌ర్ సారా (అవికాగోర్‌) పనిచేస్తుంటుంది. ఈ అన్వేష‌ణ‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్ పోలీస్ ఆఫీస‌ర్‌ కార్తీ (ఆది సాయికుమార్) హెల్ప్ తీసుకుంటుంది.

ఆరేళ్లుగా చేస్తున్న సారా పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్‌లకు సంబంధం ఏంటి?  కార్తీ ఎంట్రీతో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు మిస్సింగ్ అంశాలకు, క్షుద్ర పూజ‌లకి మధ్య ఉన్న సంబంధం ఏంటీ? ఇక కాలేజీలో ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకున్న సారా, కార్తీ ఎలా విడిపోయారు? అనేది మిగతా కథ. 

మనమే:

శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మనమే. ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా (2024 జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా చాలా గ్యాప్ తీసుకుని ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఇది అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ క్రమంలో మనమే మూవీ ఆహాలో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ తెలియజేసింది. ఏప్రిల్‌ 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కి రానుందని పోస్టర్ ద్వారా వెల్లడించింది.

కథేంటంటే:

విక్రమ్ (శర్వానంద్) లండన్ లో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఏపని లేకుండా లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్ ఫ్యామిలీ యాక్సిడెంట్‌ లో చనిపోవడంతో..  వాళ్ళ కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది. విక్రమ్, ఖుషీ మధ్యలోకి సుభద్ర (కృతిశెట్టి) కూడా వస్తుంది. మరి ఖుషి బాగోగులు చూసుకునే క్రమంలో విక్రమ్ కు తెలిసిన విషయాలు ఏంటి? ఖుషీకి సుభద్రకు ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.