ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయాలి.. మాదిగ సంఘాల మహా కూటమి

ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయాలి.. మాదిగ సంఘాల మహా కూటమి

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతికర్ పోకల కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును, ఏకసభ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అత్తర్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని కోరారు.

ఎస్సీ రిజర్వేషన్ కోటాను పెంచాలని కోరారు. మంగళవారం బర్కత్​పురాలోని మహాకూటమి సామాజిక భవన్ లో పోకల కిరణ్ మాదిగ దండోరా ధర్మదీక్ష చేపట్టారు. ఎస్సీ కుటుంబాలు ఎలాంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలను ఐఏఎస్ వంటి అత్యున్నత సర్వీస్ లో ఉన్న కుటుంబాలు మాత్రమే అనుభవిస్తున్నాయని తెలిపారు.

27, 28 తేదీల్లో మాదిగ దండోరా సభలు
ఖైరతాబాద్: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు హైదరాబాద్​లో 250 గజాల భూమి ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్​ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహా సభలు ఈనెల 27,28 తేదీల్లో నాగార్జునసాగర్​లో నిర్వహిస్తున్నామన్నారు.