జీహెచ్ఎంసీలోని 30 మంది కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు

జీహెచ్ఎంసీలోని 30 మంది కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు
  •     జీహెచ్ఎంసీలో మంచోళ్లనే నిలబెట్టాలె
  •     పార్టీలకు ఫోరమ్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ సూచన 

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని150 కార్పొరేటర్లలో 30 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్‌‌ గవర్నెన్స్ వెల్లడించింది. ఎలక్షన్స్ లో నేర చరిత్ర ఉన్నోళ్లకు టికెట్లు ఇయ్యరాదని పార్టీలను డిమాండ్‌‌ చేసింది. నేర చరిత్ర లేనోళ్లనే కార్పొరేటర్లుగా నిలబెట్టాలని కోరింది. లక్డీకాపూల్ లోని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆఫీసులో ఆ సంస్థ జనరల్ సెక్రటరీ పద్మనాభరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.  సమస్యలపై చర్చించేవాళ్లనే కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నేరస్తుల పోటీ వల్లే ఓటింగ్​ తగ్గుతోంది

నేరస్తులను నిలబెట్టడం వల్లే పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతోందని పద్మనాభరెడ్డి చెప్పారు. అలాంటి వాళ్లకు ఓటేసేందుకు సిటిజన్లు ఇంట్రెస్ట్ చూపడంలేదన్నారు. 2016 ఎన్నికల్లో పోటీచేసిన 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. వీరిలో 30 మంది గెలిచారన్నారు. వీళ్లలో టీఆర్ఎస్ నుంచి16, ఎంఐఎం నుంచి 13, బీజేపీ నుంచి ఒకరు పాలకవర్గంలో ఉన్నారన్నారు. ఈ నాలుగేళ్లలో మరో 17 మందిపై కేసులు నమోదయ్యాయి