- తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ డిమాండ్
ఖైరతాబాద్,వెలుగు : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన సిరీస్ ఫార్మా కంపెనీపై క్రిమినల్ కేసులు పెట్టి, మేనేజ్ మెంట్ ను అరెస్ట్ చేయాలని తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కమిటీ అధ్యక్షుడు గోరా శ్యాంసుందర్‌గౌడ్, ప్రతినిధులు హరిత్రూడ,జిట్టా ఆయిల్రెడ్డి, రామాచారి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సిరీస్ ఫార్మా కంపెనీకి 1968లో ఆనాటి ప్రభుత్వం 14.31 ఎకరాల భూమిని, ఎకరానికి 3,500 చొప్పున ఇచ్చిందన్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బహవూర్సర్వే నంబర్ 49/13లో మొత్తం నాకా సర్కార్కంచె 58. 2 ఎకరాలు ఉందన్నారు. అందులో 1.20 ఎకరంలో బీఎస్ఎన్ఎల్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. అందులోనే గుడి, బడి, పోలీసు స్టేషన్లకు భూమి కేటాయించారని చెప్పారు. దాంట్లో వెయ్యి కోట్ల విలువైన10 ఎకరాల భూమిని సిరీస్ ఫార్మా కంపెనీ కబ్జాచేసి డీమార్ట్, సృజన టీఎంటీ, విజన్ఎలక్ట్రానిక్స్అండ్వాసవి కన్ స్ట్రక్షన్ కు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేసిందన్నారు. దీనిపై 2017లో సరూర్నగర్తహసీల్దార్, రంగారెడ్డి కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.