మాధవ్ మిశ్రా మళ్లీ వస్తున్నాడు

మాధవ్ మిశ్రా  మళ్లీ వస్తున్నాడు

లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాధవ్ మిశ్రాగా మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు పంకజ్ త్రిపాఠి. ఆయన లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన సూపర్ హిట్ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ ‘క్రిమినల్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌’.  సరిగ్గా ఆరేళ్ల క్రితం ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ సీజన్‌‌‌‌‌‌‌‌ వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన  రెండు సీజన్స్‌‌‌‌‌‌‌‌ కూడా మెప్పించాయి. దీంతో ఇప్పుడు నాలుగో సీజన్‌‌‌‌‌‌‌‌గా ‘క్రిమినల్ జస్టిస్‌‌‌‌‌‌‌‌: ఎ ఫ్యామిలీ మేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను రెడీ చేశారు. మంగళవారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 

గత సీజన్స్‌‌‌‌‌‌‌‌ తరహాలోనే క్రైమ్, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌, థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో సాగే కోర్ట్ రూమ్ డ్రామా ఇదని అర్థమవుతోంది. జీషన్ ఆయూబ్‌‌‌‌‌‌‌‌, సుర్వీన్‌‌‌‌‌‌‌‌ చావ్లా, శ్వేతాబసు ప్రసాద్, మిత వశిష్ట, ఆశా నేగి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రోహన్ సిప్పి దర్శకత్వం వహించాడు. అప్లౌజ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌, బీబీసీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌ కలిసి నిర్మించాయి. ఇక మాధవ్ మిశ్రా పాత్రలో నటించడం ఓ పాత స్నేహితుడిని కలిసినట్టుగా అనిపించిందని, ఇందులో నటించడం థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని పంకజ్ త్రిపాఠి చెప్పారు.   మే 22 నుంచి జియో హాట్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.