క్రేజీ కాంబో: సల్మాన్ ఖాన్‪తో క్రిస్టియానో రోనాల్డో

ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో క్రిస్టియానో రోనాల్డో క్రేజ్ లాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రొనాల్డో ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. మరో వైపు ఇండియాలో టాప్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్ దేశంలో ఎంతోమంది అభిమానవులను కలిగి ఉన్నారు. ఇక వీరిద్దరూ ఒకేచోట కనబడితే అభిమానులకు కన్నుల పండగే. 

ALSO READ :- NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి.. చెప్పుతో కొట్టుకున్న బంగ్లా అభిమాని

తాజాగా అలాంటి సమయం రానే వచ్చింది. ఈ రోజు(అక్టోబర్ 29) రియాద్‌లో జరిగిన టైసన్ ఫ్యూరీ వర్సెస్ ఫ్రాన్సిస్ నాగన్‌నౌ బాక్సింగ్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు క్రిస్టియానో ​​రొనాల్డో ఒకరిపక్కన మరొకరు కూర్చున్నారు. అయితే వీరిద్దరూ అనుకోకుండా ఈ మ్యాచ్ కు హాజరైనట్టు తెలుస్తుంది. వీరిద్దరూ ఒకే వరుసలో కూర్చోవడం జరిగింది. రోనాల్డో, జార్జినా రోడ్రిగ్జ్‌లకు తర్వాత సల్మాన్ ఖాన్ కూర్చున్నాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అభిమానులు దీనిని ‘క్రేజీయెస్ట్ క్రాస్ ఓవర్’గా పేర్కొంటున్నారు.