పోర్చుగీసు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో నాల్గవసారి అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల తాజా జాబితాలో $260 మిలియన్ల సంపాదనతో రొనాల్డో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. గతేడాది అతని సంపాదన $136 మిలియన్లు కాగా.. ఈ ఏడాది అది రెట్టింపు కావడం గమనార్హం.
సౌదీ ప్రో లీగ్‌లో ఆడేందుకు సౌదీ క్లబ్ అల్ నాసర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రొనాల్డో సంపద గణనీయంగా పెరిగింది. రెండున్నర సంవత్సరాల పాటు ఆడేలా ఒప్పందం చేసుకున్న పోర్చుగీసు స్టార్.. ఒక్కో సీజన్‌కు €200 మిలియన్ ఆర్జించనున్నాడు. ఈ జాబితాలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు జోన్ రాహ్మ్ $218 మిలియన్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచాడు. అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గత 12 నెలల్లో $135 మిలియన్ల సంపాదనతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్రెజిల్‌కు చెందిన జూనియర్ నేమార్‌తో పాటు కైలియన్ ఎంబాపే, కరీమ్ బెంజెమా అత్యధికంగా సంపాదించే 10 మంది అథ్లెట్లలో చోటుదక్కించుకున్న ముగ్గురు ఫుట్‌బాల్ క్రీడాకారులు.
ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్లు
- క్రిస్టియానో రొనాల్డో(ఫుట్‌బాల్): $260m
- జోన్ రహ్మ్ (గోల్ఫ్): $218m
- లియోనెల్ మెస్సీ (ఫుట్‌బాల్): $135m
- లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్): $128.2m
- జియానిస్ ఆంటెటోకౌన్‌మ్పో (బాస్కెట్‌బాల్): $111m
- కైలియన్ ఎంబాపే (ఫుట్‌బాల్): $110m
- జూనియర్ నేమార్ (ఫుట్‌బాల్): $108m
- కరీమ్ బెంజెమా (ఫుట్‌బాల్): $106m
- స్టీఫెన్ కర్రీ (బాస్కెట్‌బాల్): $102m
- లామర్ జాక్సన్ (అమెరికన్ ఫుట్‌బాలర్): $100.5m
విరాట్ కోహ్లీ
ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల తాజా జాబితాలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పేరు దరిదాపుల్లో కనిపించలేదు. 2019 ఫోర్బ్స్ లిస్టు ప్రకారం 100వ స్థానంలో నిలిచి ఏకైక భారతీయుడిగా రికార్డుల్లోకెక్కిన కోహ్లీ. .ఆ తరువాత దిగజారాడు.