చిరంజీవి లెగసీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వారసత్వం గురించి ఆయనపై జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 11)నాడు బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రహ్మా ఆనందం’ కామెడీ డ్రామా మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
https://www.youtube.com/watch?v=OpZLjM-UBn4
ఈవెంట్లో రామ్‍చరణ్ కూతురు క్లీంకారతోపాటు తన ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫొటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫొటోను చూపిస్తూ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. కామెడీ సినిమా ఈవెంట్ అనుకున్నారో తెలియదు. మనవరాళ్లతో తన ఇళ్లు ఓ లేడీస్ హాస్టల్ లా ఉంది.. నేను వార్డెన్ లా మారాను నవ్వుతూ చెప్పారు.
ALSO READ : Chiranjeevi: అనిల్ సినిమాతో నాలో హాస్య గ్రంథులు తారాస్థాయికి.. కొత్త ప్రాజెక్ట్పై చిరంజీవి క్రేజీ అప్డేట్
ఫ్లో కంటిన్యూ చేస్తూ.. రాంచరణ్ కు కూతురు ఉంది..మళ్లీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నాను..రాంచరణ్ కు కొడుకు పుట్టాలని నాకు కోరికగా ఉంది అని చిరంజీవి అన్నారు. చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగపిల్లాడు కూడా లేడు అని చిరంజీవి అన్నారు. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రామ్‍చరణ్‍కు సలహా ఇచ్చానని చెప్పారు.
తీవ్రమవుతున్న విమర్శలు
వారసత్వం కోసం అబ్బాయిని కనాలని రామ్‍చరణ్‍కు చెప్పానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారంగా రేపుతున్నాయి. ఇంకో ఆడబిడ్డని కంటాడేమోని భయం అన్న మాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ కాలంలో కూడా మగపిల్లలే వారసులు అని చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తి అనడం సరి కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు.