స్పీకర్ ను  విమర్శిస్తే ఊరుకునేది లేదు : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని  డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్స్ వాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హోదాలో ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తామన్నారు., బట్టలూడదీసి బజార్లో తిప్పుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ :పోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు.. మంత్రిని కలిసిన నల్లమల చెంచులు

సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి,  మున్సిపల్ చైర్మన్ గంగాధర్,  సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి , ఆత్మ చైర్మన్ మోహన్, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.