సెస్ రిజర్వేషన్ల కేటాయింపు పై విమర్శలు

  • సెస్ రిజర్వేషన్ల కేటాయింపు పై విమర్శలు 

  • బీసీ, ఎస్టీ, మైనారిటీలకూ నో రిజర్వేషన్

  • ఓ మండలంలోని ఓట్లు మరో మండలానికి కేటాయింపు

  • అందుబాటులో ఉండని అధికారులు

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లీడర్లు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్ ) ఎన్నికల కోసం రిజర్వేషన్ల కేటాయింపు అయోమయంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మండలానికి చెందిన ఓట్లు మరో మండలానికి కేటాయించడంతో గందరగోళం నెలకొంది. వేములవాడ అనుపురం ఆర్ అండ్ ఆర్ కాలనీలకు చెందిన ఓట్లను వేములవాడ టౌన్ 1 లో కలి పారు. తంగళ్లపల్లి మండలంలోని 9 గ్రామాల ఓట్లను సిరిసిల్ల టౌన్ 2 లో కలిపారు. రాజన్న సిరి సిల్ల జిల్లాలోని 13 మండలాలు, 255 జీపీలు, 2  మున్సిపల్ పట్టణాలు, 4 ఎమ్యెల్యే స్థానాలు సెస్ పరిధిలో ఉన్నాయి. సెస్ డైరెక్టర్ పదవికి జెడ్పీటీసీ స్థాయి, చైర్మన్ పదవిని ఎమ్మెల్యే స్థాయిగా భావిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దీంతో సెస్ రిజర్వేషన్ల కేటాయింపు న్యాయబద్ధంగా లేదని, పలు వర్గాలకు అన్యాయం జరిగేవిధంగా ఉందని ప్రతిపక్ష  నాయకులు మండిపడుతున్నారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న బీసీలకు ఒక్క స్థానాన్ని కూడా రిజర్వ్ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పట్టణంలో పద్మశాలీలు, మున్నురుకాపు, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నారు. బీసీలు అధికంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వారికి ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేదు. మరోవైపు సహకార చట్టం(1995) ప్రకారం ముగ్గురు పిల్లలుంటే సెస్ లో పోటీ చేసేందుకు అనర్హులు.

ఓట్ల తారుమారు..

వేములవాడ అర్బన్ మండలంలో ఉన్న అను పురం ఆర్అండ్అర్ కాలనీ, చీర్లవంచ ఆర్అం  డ్ఆర్ కాలనీ ఓట్లను వేములవాడ టౌన్ లో కలి పారు. తంగళ్లపల్లి మండలంలోని 9 గ్రామాలకు చెందిన 2,131 ఓట్లను సిరిసిల్ల టౌన్ 2 లో కలపడంతో 5,040 ఉన్న ఓట్లు 7,145కు పెరిగాయి.  ఓ మండలంలోని ఓటర్లను మరో మండలంలో ఎలా కలుపుతారని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎర్రం మహేశ్ ప్రశ్నించారు. ఈ విషయమై మంగళవారం కంప్లైంట్​ చేయడానికి సెస్​ ఆఫీస్​కు రాగా అధికారులు అందుబాటులో లేరు. సెస్ ఎన్నికల అధికారులు మమత, డీసీఓ బుద్ధనాయుడు, సెస్ ఎండీ రామకృష్ణ సహా ఇతర ముఖ్యమైన ఆఫీసర్లు అందుబాటులో ఉం డడం లేదని బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు.