
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపెల్లి గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలోని పాడుబడ్డ ఇండ్ల మధ్య స్థానికులకు మంగళవారం ఓ మొసలి కనిపించింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగడంతో నదిలో నుంచి పంట పొలాల ద్వారా చెరువులోకి వచ్చిన మొసలి.. ఆ చెరువులో నుంచి పాడుబడ్డ ఇంట్లోకి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. మొసలిని చూసిన గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. సిబ్బంది మొసలిని బంధించి సమీప గోదావరి నదిలో వదిలిపెట్టారు.