గద్వాల, వెలుగు : థరూర్ మండలంలోని గుడ్డం దొడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో గురువారం ఓ పెద్ద మొసలి కనిపించింది. గమనించిన స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్ ఫర్వేజ్ అహ్మద్ అక్కడికి చేరుకొని మొసలిని పట్టుకున్నారు.
గ్రామ సమీపంలోని కెనాల్ నుంచి ఈ మొసలి వచ్చిందని, ఇది సుమారు 150 కేజీలు ఉంటుందని వారు తెలిపారు. మొసలిని బంధించి జూరాల రిజర్వాయర్ లో వదిలిపెట్టారు.