పత్తి చేనులోకి మొసలి !

పత్తి చేనులోకి మొసలి !
  • కూలీలు అరవడంతో బావిలో దూకింది...
  • గద్వాల జిల్లా మల్దకల్​లో పట్టుకున్న ఫారెస్ట్  ఆఫీసర్లు

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ లోని పత్తి చేనులో మొసలి కలకలం రేపింది. మల్దకల్​కు చెందిన రైతు చాకలి సవారి తన పొలంలో సీడ్  పత్తి వేశాడు. శుక్రవారం కూలీలు పత్తి చేనులో పనికి వచ్చారు. ముందుగా క్రాసింగ్ చేసేందుకు మగ పత్తి పువ్వులను తీసుకోవడానికి వెళ్లగా..అక్కడ మొసలి కనిపించింది. 

కేకలు వేయడంతో అది భయంతో వ్యవసాయ బావిలో దూకింది. గ్రామస్తులు ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లకు సమాచారమివ్వగా వారు బావిలో నీటిని తోడి అతి కష్టం మీద మొసలిని పట్టుకొని రిజర్వాయర్ లో వదిలేందుకు తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రెండేండ్ల నుంచి మల్దకల్​లోని దేవర చెరువు నీటిలో మొసలి ఉందని.. అక్కడ నీళ్లయిపోవడంతో పంట పొలాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.