హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రోడా గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: యూకేకి చెందిన క్రోడా ఇంటర్నేషనల్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జీనోమ్ వ్యాలీలో తన కొత్త  గ్లోబల్ టెక్నికల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్ కోసం హైపెర్ఫార్మెన్స్ ఫార్మా ​ఇంగ్రీడియెంట్స్​ను, టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.  గ్లోబల్ టెక్నికల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రోడా లైఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డానియెల్ పియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెంటిలి ప్రారంభించారు.

 కొత్త పదార్ధాల అభివృద్ధి, అప్లికేషన్ డేటా ప్రొడక్షన్​,  చిన్న మాలిక్యూల్,  బయోలాజిక్ అప్లికేషన్ల కోసం శిక్షణపై ఇది దృష్టి సారిస్తుంది. ఫార్మా పరిశ్రమకు ప్రత్యేక పరిష్కారాలను అందించడానికి ఈ సెంటర్​ వీలు కల్పిస్తుంది.