నారాయణపేటలో అకాల వర్షంతో నష్టం

నారాయణపేటలో  అకాల వర్షంతో నష్టం

నారాయణపేట, వెలుగు : నారాయణపేటలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడడంతో చెట్లు, కరెంట్​ స్తంభాలు విరిగిపడ్డాయి. నారాయణపేట–హైదరాబాద్  మెయిన్ రోడ్డులోని డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విద్యుత్  సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అగ్రికల్చర్  మార్కెట్​కు అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు వర్షానికి తడిసిపోయాయి.

గండీడ్: మహమ్మదాబాద్  మండలం వెంకట్​రెడ్డి గ్రామంలోని ఐకేపీ కొనుగోలుసెంటర్ లో వడ్లు తడిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వడ్లు మొత్తం నానిపోయాయి. రైతులు టార్పాలిన్లు, కవర్లు కప్పేలోపే వడ్లన్నీ తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవల్లి: ఈదురుగాలులతో మండలంలోని నాగపూర్  గ్రామానికి చెందిన దొడ్డి జానీకి చెందిన ఐదెకరాల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.