రైతు సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రైతు సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     రుణమాఫీతో  బయటపడిన వైనం
  •     పైసలు ఇప్పించాలని బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో రైతు వాగ్వాదం

గూడూరు, వెలుగు : ఓ వ్యక్తి రైతు సంతకాన్ని ఫోర్జరీ చేసి అతడి పేరున రూ. 60 వేలు క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో అప్పు మాఫీ అయినట్లు అసలు రైతుకు మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దీంతో తాను లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండానే మాఫీ కావడం ఏంటని బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురానికి చెందిన రైతు బోడ వీరన్నకు క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తానంటూ అదే గ్రామానికి చెందిన బానోతు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి గతేడాది గూడూరులోని ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాడు. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడిన లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు అవుతుందని చెప్పి రైతుకు సంబంధించిన పట్టాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన వద్దే ఉంచుకున్నాడు. 

కొన్ని రోజుల తర్వాత రైతుకు తెలియకుండా అతడి పేరుతో, సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 60 వేలు క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. అయితే తన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని రైతు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రైతు వీరన్నకు రూ. 60 వేలు మాఫీ అయినట్లు మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఇటీవల మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించిన రైతు తాను అసలు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండానే మాఫీ అయినట్లు మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో ఆందోళనకు గురై వెంటనే గూడూరు ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చూపించాడు. గతేడాది లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారని మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. దీంతో తన పేరున లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరికి ఇచ్చారో చెప్పాలంటూ గట్టిగా నిలదీయడంతో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి అకౌంట్లోకి మనీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లు తెలిపారు. దీంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు, తన డబ్బులు తనకు ఇప్పించాలని రైతు వీరన్న డిమాండ్ చేశాడు. స్పందించిన మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదరు వ్యక్తితో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.