నందిపేట, వెలుగు : రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి నందిపేట మండలంలో 235 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. శనివారం డొంకేశ్వర్, నందిపేట మండలాల్లో నష్టపోయిన పంటలను ఏఓ జ్యోత్స్నభవాని, సిబ్బంది పరిశీలించారు.
ఈ మేరకు 230 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వచ్చినట్లు అంచనా వేశామని ఆమె తెలిపారు. పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆమె వివరించారు.