కుభీర్ మండలంలో అకాల వర్షం.. తీరని నష్టం

కుభీర్, వెలుగు: కుభీర్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, జొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలు కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న సమయంలో అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే జరిపి నష్టపోయిన పంటలకు పరిహారం అందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.