
ములుగు/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రస్తుత సీజన్లో వచ్చే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ములుగు, వెంకటాపూర్ మండలాల పరిధిలోని వ్యవసాయ క్షేత్రాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వి.వెంకన్న, అర్.విశ్వతేజ, డి.వీరన్న, బి.మాధవి బృందం సందర్శించారు. పంటలకు వచ్చిన తెగులును పరిశీలించి ఎలా కాపాడుకోవాలో రైతులకు వివరించారు.