మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిసి వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 రాష్ట్రాల్లోని 15 స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ లోని 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లో 1 రాజ్య సభ స్థానాలకు ఓటింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 9గంటలకు ప్రారంభమై.. సాయంత్ర 4గంటలకు పూర్తైయాయి. కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ జరిగి ఫలితాలు తారుమారు అయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి పోలైయిన ఓట్లను లెక్కిస్తున్నారు.
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్
కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, నాసర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్ లు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశారు.మరొకరు ఓటింగ్ కి హాజరు కాలేదు. అభ్యర్థి నారాయణ భాండాగే గెలిపించుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి
హిమాచల్ లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి కాంగ్రెస్ అభ్యర్ధి అభిషేక్ మను సింఘ్వీకికి బదులుగా బీజేపీ అభ్యర్ధి హర్ష్ మహాజన్ కు ఓటేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ఆందోళనల జరిగాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీ లు వరుసగా 7, 3 సభ్యులను ఏకపక్షంగా రాజ్యసభకు పంపగల సామర్థ్యం ఉంది. క్రాస్ ఓటింగ్ దృశ్యా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలకు ట్విస్ట్ ఇస్తూ బీజేపీ తన ఎనిమిదో అభ్యర్థిగా సంజయ్ సేథ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ 8, సమాజ్ వాదీ పార్టీ 2 రాజ్య సభ స్థానాలు గెలుచుకున్నాయి.