నీళ్ల కోసం హాస్టల్​ దాటి ఊర్లోకి..

ఎండ తీవ్రత ముదురక ముందే నీటి కొరత మొదలైంది. జైనూర్ మండలంలోని మార్లవాయి ఆశ్రమ హాస్టల్ విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ ట్యాంక్​లకు వాటర్ సప్లై కాకపోవడంతో భోజనం తర్వాత ఊర్లోని వాటర్ ​ట్యాంక్ వద్దకు వచ్చి నీళ్లు తాగి ప్లేట్లు క్లీన్​చేసుకున్నారు. నీటి అవసరం పడ్డ ప్రతిసారి హాస్టల్ కాంపౌండ్ దాటి ఊర్లోకి బారులు తీరుతున్నారు. హాస్టల్​లోని నీటి సమస్య పరిష్కరించాలని స్టూడెంట్లు, పేరెంట్స్ కోరుతున్నారు.

- – జైనూర్, వెలుగు