యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారు జామునుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు నమోఃనారసింహ అంటూ శ్రీలక్ష్మీనారసింహు న్ని స్మరిస్తూ భక్తజనులు దర్శించుకున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆగస్టు 10,2023 నాటి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి రోజువారీ హుండీ ఆదాయం లెక్కించారు ఆలయ అధికారులు. స్వామి వారి రోజువారీ ఆదాయం రూ. 11లక్షల 95వేల 669. ప్రధాన బుకింగ్ ఆదాయం రూ. 78,300, కైంకర్యములు రూ. 2,300, సుప్రభాతం రూ. 3,900, బ్రేక్ దర్శనం రూ. 1,01,700, వ్రతాలు రూ. 36,800, VIP దర్శనం రూ. 75,000-, ప్రసాదవిక్రయం రూ. 4,57,200, సువర్ణ పుష్పార్చన ద్వారా ఆదాయం రూ.79,600. ప్రచారశాఖ ద్వారా రూ. 29,310, పాతగుట్ట రూ. 12,440, కొండపైకి వాహన ప్రవేశం రూ. 2 లక్షలు, యాదఋషి నిలయం ఆదాయం రూ. 24,352, శివాలయం రూ. 10,000, పుష్కరిణీ రూ.1,500, ప్రసాదవిక్రయం రూ. 4,57,200, కళ్యాణ కట్ట రూ. 32,500, అన్నదానం రూ.10,967, గోశాల విరాళం రూ. 2000, శాశ్వత పూజలు ఆదాయం రూ.30,000. మొత్తం కలిపి స్వామి వారి రోజువారీ ఆదాయం రూ. 11లక్షల 95వేల 669.