జోగులాంబ ఆలయంలో భక్తుల రద్దీ

జోగులాంబ ఆలయంలో భక్తుల రద్దీ

అలంపూర్,వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు  చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.