కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే కొండకు చేరుకుని కోనేరులో స్నానాలు చేసి, క్యూ లైన్లలో వెళ్లి అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు నిండిపోయాయి. ఒక్క రోజులోనే రూ.7.78 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఏఈవో అంజయ్య, సూప రింటెండెంట్ హరిహరనాథ్, సునీల్ అన్ని సౌకర్యాలు కల్పించారు.