గొల్లపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. స్కూల్స్, ఆఫీసులకు సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి పసుపు బండారితో పట్నాలు వేసి, బోనాలు సమర్పించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు చప్పుళ్లతో శివశక్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్శనానికి క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన వచ్చింది. జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టికెట్ల ద్వారా రూ.96,780 ఆదాయం వచ్చినట్లు ఈవో విక్రమ్, ట్రస్టీ శాంతయ్య తెలిపారు.
మల్లెగుట్టపై భక్తుల సందడి
మల్యాల: మల్యాల శివారులోని మల్లెగుట్ట శ్రీ మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సట్టి వారాలు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నం వేసి, బోనం సమర్పించారు. తాటిపల్లి గ్రామానికి చెందిన చెందిన బాలిక మాధవి గుట్ట దిగుతూ కాలు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.